సిక్స్ ప్యాక్ నాని
on Aug 8, 2019
ఇప్పుడు నేచురల్ స్టార్ నాని కాస్త సిక్స్ ప్యాక్ నాని అవతారము ఎత్తుతున్నాడు . అవును ఇంద్రగంటి డైరెక్షన్ లో నాని ప్రెసెంట్ `వి` అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా లో నాని సిక్స్ ప్యాక్ లో కనిపించనున్నాడట ...ఇప్పటికే నాని అందుకోసం కసరత్తులు కూడా స్టార్ట్ చేసాడట. ఇందులో నాని డిఫరెంట్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ చేయబోతున్నాడట. అందుకే సిక్స్ ప్యాక్ చేస్తున్నాడని తెలుస్తోంది. ఇక ఇంద్రగంటి డైరెక్షన్ లో నాని కిది మూడో సినిమా. దీంతో ఇద్దరు హ్యాట్రిక్ కొట్టడం గారెంటీ అంటున్నారు. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాలో సుధీర్ బాబు, అదితి రావు , హైదరి , నివేత థామస్ నటిస్తున్నారు. ఇప్పటి వరకు నార్మల్ గా కనిపించిన నాని ఈ సినిమాలో సిక్స్ ప్యాక్ తో రానుండడంతో ఇంట్రస్టింగ్ గా మారింది.