యాంకర్ ఝాన్సీకి రకుల్ లిప్ లాక్?
on Aug 7, 2019
'చెప్పేవి శ్రీరంగ నీతులు, చేసేవి...' అని తెలుగులో ఒక సామెత. 'మన్మథుడు 2' వ్యవహారం ఇదే విధంగా ఉన్నట్టుంది. నాగార్జున ప్లే బోయ్ టైపు క్యారెక్టర్ చేసినట్టు టీజర్, ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. హీరోయిన్ కాకుండా కొంతమందికి లిప్ లాక్స్ ఇచ్చారు. 'ఒక పూజ భోజనం కోసం వ్యయసాయం చేయలేను' అని డబుల్ మీనింగ్ డైలాగ్ ఒకటి చెప్పారు. రకుల్ ప్రీత్ సింగ్ సిగరెట్లు కాల్చింది. కానీ, తమది ఫ్యామిలీ సినిమా అని చెబుతున్నారు. 'మన్మథుడు 2' టీమ్ చెప్పే మాటలకు, సినిమాకు ఎంతో తేడా ఉందని ఫిలింనగర్ టాక్. సెన్సార్ బోర్డు ఇచ్చిన కట్స్ కూడా అలాగే ఉన్నాయి. సినిమాలో యాంకర్ ఝాన్సీకి రకుల్ ఘాటుగా ఒక ముద్దు పెట్టిందట. లిప్ లాక్ అని టాక్. దాన్ని బ్లర్ చేయమని సెన్సార్ వాళ్లు చెప్పారు. 'అర్జున్ రెడ్డి'లో విజయ్ దేవరకొండ చెప్పిన ఒక డైలాగును సెన్సార్ బోర్డు మ్యూట్ చేసింది చూడండి... అటువంటి డైలాగును ఇంగ్లిష్, హిందీ భాషల్లో నాగార్జున చేత దర్శకుడు రాహుల్ రవీంద్రన్ చెప్పించాడు. అఫ్ కోర్స్... ఈ సినిమాలోనూ సెన్సార్ బోర్డు ఆ డైలాగును మ్యూట్ చేయమని చెప్పింది. ఇక, సినిమా ప్రారంభంలో శృంగారంలో పాల్గొన్నప్పుడు ఇద్దరు వ్యక్తులు చేసే రాగాలను వినిపించారట. వాటినీ సెన్సార్ వాళ్లు మ్యూట్ చేశారు. ఫ్యామిలీ సినిమా అంటూ ఇటువంటి సన్నివేశాలు ఏంటో? రేపు సినిమా విడుదలయ్యాక ప్రేక్షకులు ఏమంటారో చూడాలి.