సెన్సార్ చిక్కుల్లో కాజల్ అగర్వాల్ సినిమా
on Aug 7, 2019
కాజల్ అగర్వాల్ ప్రధాన పాత్రలో నటించిన తమిళ 'ప్యారిస్ ప్యారిస్' సెన్సార్ చిక్కుల్లో పడింది. కంగనా రనౌత్ నటించిన హిందీ సినిమా 'క్వీన్'కి రీమేక్ అది. ఎప్పుడో టీజర్ విడుదలైంది. అందులో కాజల్ ఛాతీపై పక్కన ఉన్న నటి ఎలీ అవరామ్ టచ్ చేసే సీన్ హాట్ టాపిక్ అయింది. హిందీ సినిమాలో అటువంటి సన్నివేశం ఉన్నప్పటికీ... దక్షిణాదిలో యధాతథంగా ఎలా పెట్టేశారు? దక్షిణాది ప్రేక్షకులు అటువంటి సన్నివేశాలను యాక్సెప్ట్ చేస్తారా? అనే చర్చ నడిచింది. ప్రేక్షకుల సంగతి ఎలా ఉన్నా... సెన్సార్ బోర్డ్ మాత్రం యాక్సెప్ట్ చేయలేదు. అదొక్కటే కాదు... 'ప్యారిస్ ప్యారిస్'లో బోల్డ్ సన్నివేశాలకు కత్తెర వేయమని సూచించిందట. సినిమా మొత్తం మీద 25 కట్స్ చెప్పారట. కొన్ని బోల్డ్ డైలాగులను మ్యూట్ చేయమని, విజువల్స్ బ్లర్ చేయమని స్పష్టం చేశారట. సెన్సార్ తీరుపై దర్శక నిర్మాతలు గుర్రుగా ఉన్నారు. "హిందీలో 'క్వీన్'కి ఎటువంటి సెన్సార్ సమస్యలు లేవు. తమిళ వెర్షన్ డైరెక్ట్ చేసిన నటుడు రమేష్ వర్మ, కన్నడ వెర్షన్ 'బటర్ ఫ్లై'కీ దర్శకత్వం వహించారు. కన్నడ సినిమాకు క్లీన్ చీట్ వచ్చింది. తమిళ వెర్షన్ ను సెన్సార్ బోర్డ్ ఎందుకు డిఫరెంట్ గా ట్రీట్ చేస్తోంది?" అని నిర్మాత మను కుమారన్ ప్రశ్నించారు. రివైజింగ్ కమిటీకి వెళుతున్నట్టు తెలిపారు. మంజిమా మోహన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న 'క్వీన్' మలయాళ వెర్షన్ 'జామ్ జామ్' సెన్సార్ కూడా పూర్తయిందని ఆయన తెలిపారు. మరి, తెలుగు వెర్షన్, తమన్నా ప్రధాన పాత్రలో నటించిన 'దటీజ్ మహాలక్ష్మి' పరిస్థితి ఏంటో?