'మన్మథుడు 2' డైరెక్టర్‌కి కిక్ ఇచ్చేది అదే..!
on Aug 5, 2019
'అందాల రాక్షసి' సినిమాలో ఒక హీరోగా నటించడం ద్వారా టాలీవుడ్లో అడుగుపెట్టాడు రాహుల్ రవీంద్రన్. ఆ తర్వాత కొన్ని సినిమాల్లో నటించి, సుశాంత్ హీరోగా నటించిన 'చి.ల.సౌ' మూవీతో డైరెక్టర్‌గా మారి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద గొప్పగా ఆడకపోయినా, రాహుల్ డైరెక్షన్‌కు విమర్శకుల నుంచి ప్రశంసలు లభించాయి. ఇప్పుడు తన రెండో సినిమా 'మన్మథుడు 2'లో ఏకంగా నాగార్జున వంటి టాప్ స్టార్‌ను డైరెక్ట్ చేసేశాడు. ఆ సినిమా ఆగస్ట్ 9న రిలీజవుతోంది.
నటన, దర్శకత్వం.. ఈ రెండింటిలో రాహుల్‌కు ఏది ముఖ్యం? తనకు కిక్కిచ్చేది డైరెక్షనే అని చెప్తున్నాడు రాహుల్. "ఎప్పుడో యాక్టర్‌ని అయిపోయా. డైరెక్టర్ని అవ్వాలని వెయిట్ చేస్తూ వచ్చా. అయ్యాను. నాకు కిక్కిచ్చేది డైరెక్షన్. అలాగే యాక్టింగ్ అంటే ఇష్టం. యాక్టర్‌గా లవ్ స్టోరీస్ చేశాను. సర్వైవ్ అవడానికి కొన్ని సినిమాలు చేశాను. అయితే అమేజింగ్ అనిపించిన కేరెక్టర్, ఈ కేరెక్టర్ చేస్తే నన్ను నేను ఎక్స్ప్లోర్ చేసుకోవచ్చు అనే కేరెక్టర్స్ చేస్తాను తప్ప, డైరెక్షన్ చేస్తూ మధ్య మధ్యలో ఏవైనా సినిమాల్లో నటిస్తుండాలి అనేది పెట్టుకోలేదు. మంచి కేరెక్టర్ చేయడం ఒక బ్రేక్ లాగా ఉంటుంది. అలాంటివి రాకపోతే రాలేదని బాధపడను. హాయిగా డైరెక్షన్ చేసుకుంటూ ఉంటా" అని చెప్పాడు రాహుల్.