టాక్ ఆఫ్ ది టౌన్: నాగార్జున ఓల్డ్ గెటప్!
on Aug 5, 2019
వయసు పెరిగే కొలదీ ఎవరిలోనైనా వృద్ధాప్య ఛాయలు కనిపిస్తాయి. కానీ, అక్కినేని అందగాడు నాగార్జున మాత్రం రోజు రోజుకీ నవ యువకుడిగా మారుతున్నారు. వయసు పెరిగే కొలదీ యువకుడిగా మారుతున్నారు. అరవైలలో ముప్పై ఏళ్ల కుర్రాడిలా కనిపిస్తున్నారు. 'మన్మథుడు 2' ప్రచార చిత్రాలే అందుకు ఉదాహరణ. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నాగచైతన్య "నాన్న సినిమా ఫంక్షన్స్ కి రావాలంటే భయం వేస్తుంది. మమ్మల్ని అన్నదమ్ములు అనుకుంటున్నారు" అని అన్నారంటే నాగార్జున ఎంత యంగ్ గా కనిపిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. నాగార్జున కూడా తన వయసు 30 ఏళ్లే అంటున్నారు. నాగచైతన్య చెప్పినట్టు 'మన్మథుడు 2'లో నాగార్జున చాలా యంగ్ గా కనిపిస్తున్నారు. అయితే... సినిమాలో నాగార్జున ఓల్డ్ గెటప్ లో కూడా కనిపించనున్నారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఆ లుక్ విడుదల చేశారు. సినిమాలో ఈ గెటప్ లో ఎంత సేపు కనిపిస్తారో గానీ... ఇప్పుడీ లుక్ టాక్ ఆఫ్ ది టౌన్ అయింది. నవ యవ్వన మన్మథుడు నాగార్జునను వృద్ధుడిగా చూపించారు దర్శకుడు రాహుల్ రవీంద్రన్. ఈ సినిమా తప్పకుండా విజయం సాధిస్తుందని నాగార్జున విశ్వాసం వ్యక్తం చేశారు. ఆగస్టు 9న కడుపుబ్బ నవ్విస్తానని చెబుతున్నారు.