ఆ అమ్మాయితో ప్రభాస్ పెళ్లి !
on Aug 3, 2019
తెలుగు ఇండస్ట్రీలో ఎవర్ గ్రీన్ హాట్ టాపిక్ ఏదైనా ఉందా అంటే అది ప్రభాస్ పెళ్లి అనే చెప్పాలి. ఒకరకంగా వార్తలు రాయడానికి లేని ప్రతి సారి ఈయన పెళ్లి టాపిక్ ని తెర మీదకి తెస్తాయి వెబ్ సైట్స్ అలాగే యూట్యూబ్ చానెల్స్. ఎప్పుడు మాట్లాడినా ప్రభాస్ పెళ్లి అనేది ట్రెండింగ్లోనే ఉంటుంది. తాజాగా ప్రభాస్ పెళ్లి గురించి మరో వార్త బయటికి వచ్చింది. నిజానికి గతంలో ప్రభాస్ పెళ్ళికి సంబంధించి పలు వార్తలు వస్తే వాటిని ప్రభాస్ పెద్దనాన్న కృష్ణం రాజు ఖండించారు. సరైన సమయంలో మేమే అఫీషియల్ ప్రకటన చేస్తామని అన్నారు.
కానీ అమెరికాలో వ్యాపారిగా స్థిరపడిన తెలుగు కుటుంబానికి చెందిన అమ్మాయితో ప్రభాస్ పెళ్లి జరగనున్నట్లు సమాచారం. మరి ఇందులో ఎంత నిజముందనేది రానున్న రోజులలో తెలియనుంది. ప్రభాస్ ప్రస్తుతం సాహో ప్రమోషన్స్తో పాటు రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాతో బిజీగా ఉన్నాడు. ప్రభాస్ వయసు కూడా 39కి వచ్చేసింది. అయినా కూడా పెళ్లి వైపు చూడటం లేదు ఈ హీరో. ఏమో ఈ సారి అయినా ఈ వార్త నిజమవుతుందో ? లేదో మరి.