సాహో ప్రీ రిలీజ్ డేట్ ఫిక్సైంది!!
on Aug 1, 2019
`బాహుబలి` సిరీస్ తర్వాత ప్రభాస్ హీరోగా , బాలీవుడ్ నటి శ్రద్ధాకపూర్ హీరోయిన్ గా హైటెక్నికల్ వాల్యూస్ తో రూపొందుతోన్న యాక్షన్ ఎంటర్ టైనర్ `సాహో`. ఇక ఇప్పటికే విడుదలైన టీజర్ , సాంగ్స్ సినిమా పై భారీ అంచనాలను రేకెత్తించాయి. ఇక ఈ సినిమాను గ్రాండ్ గా తెలుగు ,తమిళ్, కన్నడ , హిందీ భాషలలో ఆగస్ట్ 30న గ్రాండ్ గా రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఫంక్షన్ భారీగా హైదరాబాద్లో లాల్ బహదూర్ స్టేడియంలో ఈనెల 17న చేయడానికి ప్లాన్ చేస్తున్నారట చిత్ర యూనిట్. ఇక ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్స్ ఒక్కొక్కటి రిలీజ్ చేస్తూ ప్రమోషన్ ని ప్రారంభించారు. ఇక ఇందులో ని పాటలను ఒక్కో పాటను ఒక్కో సంగీత దర్శకుడు కంపోజ్ చేయడం విశేషం. ఇక గిబ్రాన్ ఈ చిత్రానికి నేపథ్య సంగీతాన్ని సమకూరుస్తోన్న సంగతి తెలిసిందే.