మెగాస్టార్‌తో మళ్లీ కాజలేనా??
on Aug 1, 2019
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం `సైరా` లో నటిస్తున్నాడు. ఈ సినిమా ఆఖరి దశలో ఉంది. ఇక తన తదుపరి సినిమాను కొరటాల శివ దర్శకత్వంలో చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా నక్సలిజం నేపథ్యంలో ఉండబోతున్నట్లు సమాచారం అందుతోంది. మధ్య వయస్కుడుగా, యువకుడుగా ఇలా టు షేడ్స్ లో చిరంజీవి క్యారక్టర్ ఉంటుందట. ఇక వరుస సక్సెస్ లతో అపజయమే ఎరుగని దర్శకుడుగా పేరు తెచ్చుకున్న కొరటాల శివ ఈ చిత్రాన్ని చిరంజీవి కెరీర్ లోనే గుర్తుండిపోయే చిత్రంగా తెరకెక్కించడానికి ప్లాన్ చేస్తున్నాడట. అయితే ఈ సినిమా ఆగస్ట్ 22న చిరంజీవి బర్త్ డే సందర్భంగా షూటింగ్ ప్రారంభించనున్నట్లు సమాచారం. రెగ్యులర్ షూటింగ్ దసర తర్వాత నుంచి ఉండే అవకాశాలున్నాయట. ఇదిలా ఉంటే ఈ సినిమాలో మొదట నయనతార ను హీరోయిన్ గా తీసుకుందామనుకున్నారట. కానీ ఆల్ రెడీ సైరా లో చేసి ఉండటంతో శృతి హాసన్ ని కానీ కాజల్ ని కానీ తీసుకునే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. అయితే శృతి హాసన్ కన్నా కూడా కాజల్ నే హీరోయిన్ గా తీసుకునే అవకాశాలున్నట్లు వినికిడి . ఇక `సైరా` ట్రైలర్ ను ఆగస్ట్ 22న చిరు బర్త్ డే సందర్భంగా రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే ట్రైలర్ కు సంబంధించిన ఆర్ ఆర్ కార్యక్రమాలు తమన్ చేస్తున్నాడట.