బన్నీ సినిమా నుంచి తప్పుకున్న టాలెంటెడ్ యాక్టర్!!
on Jul 30, 2019
త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో బన్నీ ఓ సినిమాలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్లో శరవేగంగా జరుపుకుంటోంది. అయితే త్రివిక్రమ్ చేసే ప్రతి సినిమాలో మంచి పాత్ర చేసే రావు రమేష్ ఈ సినిమా నుంచి తప్పుకున్నాడట. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే రావు రమేష్ తప్పుకోవడం వెనుక ఎలాంటి కాంట్రవర్సీ లేదట. ముందుగా అనుకున్న సమయం కన్నా షూటింట్ డిలే అవడంతో రావు రమేష్ డేట్స్ సర్దుబాటు కానీ కారణంగానే ఆయన తప్పుకున్నట్లు తెలుస్తోంది. ఇక దీంతో రావు రమేష్ స్థానంలో నటుడు, రైటర్ హర్షవర్థన్ ని తీసుకున్నారట. మరి రావురమేష్ క్యారక్టర్ ని హర్ష వర్థన్ చేయగలడా ? అంటే ఆయన కూడా సమర్థవంతమైన నటుడే కాబట్టి సమస్య ఏమీ ఉండదంటున్నారు సినీ జనాలు. ఇక బన్నీ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రానికి `నేను నాన్న` అనే టైటిల్ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.