మహేష్ బిజినెస్ అదుర్స్!!
on Jul 27, 2019
ప్రజంట్ సినిమా స్టార్స్ సినిమాలతో పాటు బిజినెస్ రంగాల్లోకి కూడా ఎంట్రీ ఇస్తున్నారు. ఇప్పటికే మహేష్ బాబు గచ్చిబౌలిలో `ఏఎమ్ బీ` సినిమాస్ పేరుతో భారీ మల్టీప్లెక్స్ ను ఆరంభించిన విషయం తెలిసిందే. ఇక ఆ మధ్య ప్రొడక్షన్ లోకి అడుగుపెడుతూ వెబ్ సిరీస్ కూడా నిర్మించబోతున్నట్లు వార్తలు వచ్చాయి. ఇదిలా ఉంటే మరో బిజినె స్ ని మహేష్ ప్రారంభించబోతున్నాడట. అదేమిటంటే సొంతంగా బట్టల బ్రాండ్ ను లాంచ్ చేయనున్నారట. `` మిమ్మలి ఎగ్జైట్ చేయబోయే ఓ మ్యాటర్ మీతో పంచుకోబుతున్నాం`` అంటూ ఓ వెబ్ సైట్ లింక్ ని మహేష్ యూనిట్ పోస్ట్ చేయడంతో దాన్ని మహేష్ తిరిగి షేర్ చేసారట. ఇక ఆ వెబ్ సైట్ లోకి వెళితే బట్టల బ్రాండ్స్, వాటి రకాలు ఇలా చాలా ఆప్షన్స్ ఉంటాయట. మరో మూడు రోజుల్లో ఈ ఆన్ లైన్ వెబ్ సైట్ లాంచ్ కాబోతున్నట్లు సమాచారం. ఇక ఇప్పటికే రౌడి పేరుతో విజయ్ దేవరకొండ సొంత దుస్తుల బ్రాండ్ ఆరంభించిన విషయం తెలిసిందే. ఇక టాలీవుడ్ పలువుర దర్శకులు, హీరోలు ఇప్పటికే హోటల్స్ తో పాటు పలు బిజినెస్ లు ప్రారంభించారు. మహేష్ ఇన్ స్పిరేషన్ తో ఇంకా చాలా మంది సెలబ్రిటీస్ బిజినెస్ రంగంలోకి రావడం ఖాయం అంటున్నారు సినీ జనాలు.