బ్యాంకాక్ లో బాలయ్య సినిమా!!
on Jul 27, 2019
నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా కె.యస్. రవికుమార్ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందనున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి `రూలర్` పేరు పరిశీలిస్తున్నట్లు సమాచారం అందుతోంది. అయితే ఈ చిత్రంలో బాలయ్య పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా, గ్యాంగ్ స్టర్ గా టు షేడ్స్ ఉన్న డిఫరెంట్ క్యారక్టర్స్ లో నటించబోతున్నట్లు సమాచారం అందుతోంది. ఇప్పటికే బాలయ్య సరసన వేదిక, సోనాల్ చౌహాన్ హీరోయిన్లుగా నటించబోతున్నల్లు న్యూస్ వచ్చాయి. వీరిద్దరినీ దాదాపు ఖరారు చేసినట్లే తెలుస్తోంది. ఇక ఈ చిత్రం ఫస్ట్ షెడ్యూల్ ఆగస్ట్ 7న బ్యాంకాక్ లో స్టార్ట్ కానుందట. ఈ షెడ్యూల్ లో ఒక పాటతో పాటు కొన్ని సీన్స్ కూడా చిత్రీకరించనున్నారట. చిరంతన్ భట్ సంగీతాన్ని సమకూరుస్తోన్న ఈ చిత్రాన్ని సి.కళ్యాణ్ నిర్మిస్తున్నారు. నెక్ట్స్ ఇయర్ సమ్మర్ లో ఈ సినిమా రిలీజ్ కానుంది.