సొంత కథ.. డిఫరెంట్ స్క్రీన్‌ప్లేతో!
on Jul 27, 2019
'ఓ బేబీ'తో సమంత మాత్రమే కాదు... దర్శకురాలు నందినిరెడ్డి కూడా హిట్ కొట్టారు. 'కల్యాణ వైభోగమే' తర్వాత వెబ్ కంటెంట్ మీద కాన్సంట్రేట్ చేసిన ఆమె, సిల్వర్‌స్క్రీన్ మీద గ్రాండ్ ఎంట్రీ ఇచ్చారు. అయితే... 'ఓ బేబీ' కొరియన్ సినిమాకు రీమేక్. నెక్స్ట్ సినిమాకు మాత్రం రీమేక్ కథ తీసుకోనని నందినిరెడ్డి స్పష్టం చేస్తున్నారు. సొంత కథ.. డిఫరెంట్ స్క్రీన్‌ప్లేతో సినిమా చేయబోతున్నాని ఆమె తెలిపారు. వైజయంతి మూవీస్, దాని అనుబంధ సంస్థ స్వప్న సినిమాస్‌తో నందినిరెడ్డికి రెండు సినిమాల అగ్రిమెంట్ ఉంది. తన తదుపరి సినిమాను ఆ సంస్థల్లో చేయనున్నారు. అయితే ఇంకా ఆమె బౌండ్ స్క్రిప్ట్ రెడీ చేయలేదు. త్వరలో యూకే వెళుతున్నారు. హాలీడే ట్రిప్ పూర్తి చేసుకుని, తిరిగొచ్చాక తదుపరి సినిమా మీద దృష్టి పెడతారు.