అప్పుడే పిల్లలు వద్దనుకుంటున్నా..
on Jul 4, 2019
ఇటీవల సమంత ప్రెగ్నెన్సీ మీద పెద్ద చర్చే జరిగింది సోషల్ మీడియాలో. అయితే `ఓ బేబి` సినిమా ప్రమోషన్ లో భాగంగా ఈ రోజు మీడియాతో ముచ్చటించింది. అందులో భాగం ఓ జర్నలిస్ట్ ప్రెగ్నెన్సీ విషయం గురించి మిమ్మల్ని అందరూ అడుగుతుంటే మీకు ఏమనిపిస్తుంది? అని అడగ్గా ఆమె సమాధానమిస్తూ....``అందులో ఏముంది. నేను కూడా నా ఫ్రెండ్స్ ని పిల్లల గురించి ఏం ప్లాన్ చేసుకున్నారనీ అడుగుతాను. అలాగే నన్ను అడుగుతున్నారనుకుంటాను. భగవంతుడి దయవల్ల నేను స్వతంత్య్రంగా ఉండగలుగుతున్నా. నాకు ఈ ఏడాది పిల్లలు వద్దని చెప్పగలుగుతున్నా..అంటూ అప్పుడే పిల్లలు వద్దుకుంటున్నా అని చెప్పకనే చెప్పిందీ బ్రెయిన్ విత్ బ్యూటీ సమంత. ఇంకా ఆమె మాట్లాడుతూ...``ఇటీవల మన్మథుడు-2 లో చిన్న క్యారక్టర్ చేసా. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో సినిమా చేయాలన్న కోరిక ఉంది. ఎందుకంటే ఆయన హీరోయిన్స్ ని ప్రొజెక్ట్ చేసే తీరు నాకు చాలా నచ్చుతుంది. ఇక రీమేక్స్ చేయాలని పెద్దగా లేకపోయినా...ప్రజంట్ ఆ ట్రెండ్ నడుస్తోంది. 96 లో మంచి పాత్ర చేస్తున్నా. ఫ్యూచర్ లో నిర్మాతగా లేడీ ఓరియెంటెడ్ సినిమాలు నిర్మించవచ్చు కానీ, డైరక్షన్ చేసే ఆలోచన మాత్రం లేదు అంటూ పలు ఆసక్తికరమైన విషయాలు వెల్లడించింది.