రొమాంటిక్ హీరోకి జోడీగా పూజా!!
on Jul 3, 2019
`సోగ్గాడే చిన్నినాయనా` చిత్రం నాగార్జున కెరీర్ లోనే హయ్యస్ట్ గ్రాసర్ గా నిలిచిన సంగతి తెలిసిందే. ఇక ఆ చిత్రానికి సీక్వెల్ గా `బంగార్రాజు` పేరుతో కళ్యాణ్ కృష్ణ డైరక్షన్ లో ఓ చిత్రం రూపొందుతోంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ కూడా పూర్తి కావొచ్చిందట. అగస్ట్ లో సినిమా షూటింగ్ ప్రారంభించడానికి ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. మల్టీ స్టారర్ మూవీ తెరకెక్కే ఈ సీక్వెల్ లో నాగార్జున తో పాటు నాగచైతన్య కూడా నటిస్తున్నాడు. ఇప్పటికే నాగ చైతన్య సరసన కీర్తి సురేష్ ని హీరోయిన్ గా తీసుకున్నారని వార్తలు వస్తున్నాయి. ఇక కింగ్ నాగార్జునాకు జోడీ గా పూజా హెగ్డేను ఎంపిక చేసినట్లు ఫిలింనగర్ సమాచారం. గతంలో చైతుతో నటించిన పూజా ఈ సినిమాలో నాగ్ కి జోడీగా నటిస్తుండటంతో అంతటా ఆసక్తి మొదలైంది. ప్రజంట్ నాగార్జున మన్మథుడు 2 లో నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తి కావొచ్చింది. ఇదిలా ఉంటే ఈసారి బిగ్ బాస్ 3 కోసం రంగంలోకి దిగుతున్నాడు కింగ్ నాగార్జున.