`సైరా` డబ్బింగ్ కంప్లీట్ చేసిన మెగాస్టార్!!
on Jun 29, 2019
తెలుగు ఫష్ట్ ఫ్రీడమ్ ఫైటర్ ఉయ్యాల వాడ నరసింహా రెడ్డి లైఫ్ హిస్టరీ ఆధారంగా రూపొందుతోన్న చిత్రం `సైరా నరసింహా రెడ్డి`. టైటిల్ పాత్రలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ఇటీవల కంప్లీట్ చేసుకుంది. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నిర్మిస్తున్నాడు. ఈ చారిత్రాత్మక చిత్రం షూటింగ్ లో ఉండగానే తన పాత్రకు డబ్బింగ్ స్టార్ట్ చేసాడు చిరంజీవి. ఇక లేటెస్ట్ గా చిరు తన పోర్షన్ కు సంబంధించి డబ్బింగ్ ను కంప్లీట్ చేసినట్లు తె లుస్తోంది. కేవలం 20 గంటల్లోనే తన పాత్రకు డబ్బింగ్ చెప్పి యూనిట్ ని షాక్ కి గురి చేసారు మెగాస్టార్. దీంతో ఆగస్ట్ చివరి కల్లా పోస్ట్ ప్రొడక్షన్ పనులు కంప్లీట్ చేసి అదే 22న సైరా ట్రైలర్ ను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2న సినిమా రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో అమితాబచ్చన్, నయన , తమన్నా, విజయ్ సేతుపతి సుదీప్ , జగపతి బాబు తదితరులు నటిస్తున్నారు.