నితిన్ తో ప్రియా వార్ రొమాన్స్!!
on Jun 6, 2019
ఒక కంటి సైగతో గూగుల్ ని షేక్ చేసిన బ్యూటి ప్రియా వారియర్. ఒరు ఆధార్ లవ్ సినిమాతో మాలీవుడ్ కి పరిచయమైంది ప్రియా ప్రకాష్ వారియర్. ఆ మూవీలోని ఒక సాంగ్ లో కనుసైగలు చేసి ప్రేక్షకులను ఆకట్టుకుని ఓవర్ నైట్ సెలబ్రిటీగా మారారు. గూగుల్ లో అత్యదికంగాసెర్చ్ చేసిన సెలబ్రిటీగా ప్రియా ప్రకాష్ ముందున్నారు. ప్రియా ప్రకాష్ చాలా మూవీ ఆఫర్స్ అందుకున్నారు. ఇప్పుడు హీరో నితిన్ తో ఒక మూవీ లో ప్రియా ప్రకాష్ జతకట్టనున్నారని సమాచారం. భవ్య క్రియేషన్స్ బ్యానర్ పై చంద్ర శేఖర్ యేలేటి దర్శకత్వంలో నితిన్ హీరోగా ఒక మూవీ రూపొందనుంది. ఆ మూవీలో హీరోయిన్ గా ప్రియా ప్రకాష్ సెలెక్ట్ అయినట్టు సమాచారం. దర్శకులు వెంకీ కుడుమల, వెంకీ అట్లూరి దర్శకత్వంలో రూపొందనున్న రెండు మూవీస్ కు నితిన్ కమిట్ అయ్యారు. ఈ రెండు మూవీస్ సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై రూపొందడం విశేషం.