పవన్ రాజకీయాలకు ప్యాకప్
on May 29, 2019
జనసేన పార్టీ అధ్యక్షుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఘోరమైన పరాజయం పొందిన విషయం తెలిసిందే. ఇక ఇంత కాలం సినిమాలకు గుడ్ బై చెప్పి పూర్తిగా రాజకీయాల్లో మునిగిపోయిన పవన్ ఇక ఇప్పుడు ఎలక్షన్స్ రిజల్ట్స్ తర్వాత మళ్లీ సినీ ఎంట్రీ పై న్యూస్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. ఇక పవన్ తో సినిమాలు చేయడానికి ప్రముఖ నిర్మాలు ఎదురు చూస్తున్నారు. అంతే కాదు గతంలో పవన్ కు అడ్వాన్స్ ఇచ్చిన పలు నిర్మాణ సంస్థలు కూడా పవన్ కోసం తెగ ప్రయత్నిస్తున్నట్లు సమాచారం అందుతోంది. ఇక ఇన్ని రోజులు పవన్ కళ్యాణ్ తెల్లటి వస్త్రాల్లో రాజకీయ నాయకుడిలా మారిపోయారు. తాజాగా టీషర్ట్, జీన్స్ పాయింట్ ధరించిన ఫొటో ఒకటి ప్రజంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇదిలా ఉంటే మరో హాట్ టాపిక్ ఏంటంటే...నటుడు, నిర్మాత బండ్ల గణేష్ పవన్ కళ్యాన్ తో సినిమా చేయాలని ప్రయత్నాలు చేస్తున్నాడట. దీనికోసం పనన్ కు భారీ రెమ్యూని రేషన్ ఇవ్వడానికి సైతం సిద్ధమయ్యాడట బండ్ల. దీనికి బోయపాటి దర్శకుడుగా తీసుకోవాలన్న ఆలోచనలో ఉన్నాడట గణేష్. మరి ఈ వార్తలో ఎంత వరకు నిజముందనేది తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు ఆగాల్సిందే.