'సాహో' కి ఆప్షన్ థమన్ ఒక్కడేనా?
on May 28, 2019
ఇప్పటికి ఇప్పుడు 'సాహో' టీమ్ కొత్త సంగీత దర్శకుణ్ణి వెతికి పట్టుకోవాల్సిన పరిస్థితి. బీటౌన్ మ్యూజిక్ డైరెక్టర్లు శంకర్,ఎహసాన్, లాయ్ తప్పుకోవడంతో రెండేళ్లుగా సినిమా చెక్కుతున్న దర్శక, నిర్మాతలకు టెన్షన్ తప్పలేదు. సినిమా విడుదలకు నెలన్నర మాత్రమే ఉంది. ఈ టైమ్‌లో సినిమాను టేకప్ చేసిన ఏ మ్యూజిక్ డైరెక్టర్ అయినా... త్వరగా ట్యూన్లు, ఆగస్టు 15కి వారం రోజుల ముందు రీ రికార్డింగ్ ఫినిష్ చేసి ఇవ్వాలి. త్వరగా ట్యూన్లు ఇవ్వకపోతే పాటలు షూట్ చేయలేరు. ఒకవేళ సాంగ్స్ షూటింగ్ కంప్లీట్ చేసి, శంకర్-ఎహసాన్-లాయ్ ట్యూన్లు వాడరాదని 'సాహో' టీమ్ నిర్ణయించుకుంటే... సాంగ్ షూటింగుకు తగ్గట్టు ట్యూన్ రెడీ చేసి ఇవ్వాలి. ఓవర్సీస్కి సకాలంలో సినిమా హార్డ్ డిస్క్‌లు వెళ్ళాలన్నా, సెన్సార్ సమయానికి పూర్తి కావాలన్నా... వారం రోజుల ముందు రీ రికార్డింగ్ ఫినిష్ చేయాలి. అంత కెపాసిటీ ఉన్న మ్యూజిక్ డైరెక్టర్ ఎవరున్నారు? 'సాహో' టీమ్ ముందు వన్ అండ్ ఓన్లీ ఆప్షన్ ఒక్కరే... అదీ తమన్ అని ఇండస్ట్రీ టాక్. ఫాస్ట్‌గా మ్యూజిక్ చేస్తాడని తమన్‌కి పేరుంది. అలాగే, 'సాహో' ఫస్ట్ మేకింగ్ వీడియో 'షేడ్స్ ఆఫ్ సాహో చాప్టర్ 1'కి మ్యూజిక్ ఇచ్చిన అనుభవం అతడికి ఉంది. అన్నిటికీ మించి మొన్నటికి మొన్న 'మజిలీ'కి రీ రికార్డింగ్ చేయలేనని గోపిసుందర్ హ్యాండ్ ఇస్తే... లాస్ట్ మినిట్ లో తమన్ చేసి ఇచ్చాడు. ప్రజెంట్ సిట్యువేషన్ చూస్తుంటే... 'సాహో'కి తమన్ మ్యూజిక్ చేసే ఛాన్సులు ఎక్కువ.