నాని నెక్స్ట్ ప్రొడక్షన్లో హీరో అతడే
on May 28, 2019
యస్... నిర్మాతగా మరో సినిమాకు శ్రీకారం చుట్టాడు నాని. 'అ!'తో నేచురల్ స్టార్ నిర్మాతగా మారిన సంగతి తెలిసిందే. కొత్త కథలను ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో 'వాల్ పోస్టర్' సంస్థను స్థాపించాడు. ఇప్పుడీ బ్యానర్‌పై 'ఈ నగరానికి ఏమైంది', 'ఫలక్‌నుమా దాస్' ఫేమ్ విశ్వక్ సేన్ హీరోగా ఒక సినిమా నిర్మిస్తున్నాడు నాని. సోమవారం సాయంత్రం జరిగిన ఫలక్‌నుమా దాస్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి ఛీఫ్ గెస్ట్‌గా వచ్చిన నాని ఈ విషయాన్ని వెల్లడించాడు. దర్శకుడు, ఇతర వివరాలు చెప్పలేదు. త్వరలో బయటకు వచ్చే అవకాశం ఉంది. ఇక, 'ఫలక్‌నుమా దాస్' సినిమా గురించి నాని మాట్లాడుతూ "ఆల్రెడీ సినిమా చూశా. చాలా బావుంది. సింగిల్ స్క్రీన్, మల్టీప్లెక్స్ తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఎంజాయ్ చేస్తారు. విశ్వక్ సేన్, ఉత్తేజ్ గారు, చిన్న పిల్లలు బాగా యాక్ట్ చేశారు. తరుణ్ భాస్కర్‌కి అయితే బెస్ట్ యాక్టర్ అవార్డు ఇవ్వొచ్చు. అంత బాగా యాక్ట్ చేశాడు. తను డైరెక్షన్ మానేసి యాక్టింగ్ కి వస్తే... మూడు రేట్లు ఎక్కువ సంపాదించవచ్చు. ఒక్క రోజు కూడా ఖాళీగా ఉండదు. బిజీ యాక్టర్ అవుతాడు" అన్నారు.