ఈ నెలలోనే బన్నీ మరో చిత్రం ముహూర్తం!!
on May 4, 2019
`ఆర్య`, ఆర్య-2` తర్వాత అల్లు అర్జున్ , సుకుమార్ కాంబినేషన్ లో ఓ చిత్రం రూపొందనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు ఫైనల్ దశకు చేరుకున్నాయి. ఈ నెల 11న సినిమా లాంఛనంగా ప్రారంభించనున్నారని తెలుస్తోంది. ప్రజంట్ త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ ఓ సినిమాలో నటిస్తున్నాడు . ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. ఈ సినిమా షూటింగ్ లో ఉండగానే మరో సినిమాను లైన్లో పెట్టాడు బన్ని. నా పేరు సూర్య తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న బన్ని కంటిన్యూస్ గా సినిమాలు చేయడానికి ఫిక్సయ్యాడు.