సైరా సెట్ కాలిపోయింది!!
on May 3, 2019
హైదరాబాద్ లోని మెగాస్టార్ చిరంజీవి ఫామ్ హౌస్ లో ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. ఈ ఫామ్ హౌసులో `సైరా` సినిమా కోసం వేసిన సెట్స్ అన్ని కాలిపోయింది. ఈ ఫైర్ యాక్సిడెంట్ జరిగిన వెంటనే ఫామ్ హౌసు నిర్వాహకులు ఫైర్ స్టేషన్ వారికి సమాచారమివ్వడంతో వెంటనే ఫైర్ ఇంజన్స్ వచ్చి మంటలు ఆర్పేయడానికి ప్రయత్నాలు చేసాయి. ఇక సైరా సెట్ లో అగ్ని ప్రమాదినికి గల కారణాలు అన్వేషిస్తున్నారట. ఇటీవల ఈ సినిమా షూటింగ్ కేరళలో పూర్తి చేసుకుంది. అక్కడ కొన్ని యాక్షన్ ఎపిసోడ్స్ చిత్రీకరించారు. ఈ షెడ్యూల్ తో ఈ సినిమాకు సంబంధించిన టాకీ పార్ట్ దాదాపు పూర్తైనట్టు తెలుస్తోంది. ప్యాచ్ వర్క్ త్వరలో షూట్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇంతలో సైరా సెట్ కాలిపోవడంతో యూనిట్ అంతా షాక్ కి గురయ్యారు.
సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాను కొణిదెల ప్రొడక్షన్ బేనర్ పై రాచ్ చరణ్ నిర్మిస్తున్నాడు. అమితాబచ్చన్ , సుదీప్, జగపతిబాబు, విజయ్ సేతుపతి ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. నయనతార, తమన్న హీరోయిన్స్ గా నటిస్తున్నారు. అనుష్క కూడా గెస్ట రోల్ లో కనిపించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.