360 డిగ్రీస్ లో అందగాడు మహేష్- విక్టరి
on May 2, 2019
`సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు` చిత్రంలో అన్నదమ్ములుగా నటించారు వెంకటేష్, మహేష్. ఈసినిమా దగ్గర నుంచి వీరిద్దరికీ మధ్య అన్నదమ్ముల అనుబంధం ఏర్పడింది. ఒకరినొకరు ఇష్టపడుతుంటారు. మహేష్ `మహర్షి` ప్రీ రిలీజ్ ఫంక్షన్ కు అతిథిగా విచ్చేసిన విక్టరీ వెంకటేష్ , మహేష్ ను తెగ పొగిడేసాడు. `మహేష్ ప్రపంచాన్నే ఏలేస్తాడమ్మా!! ట్రైలర్ చూసారుగా.. అదిరిపోయిందిగా అంటూ అందర్నీ నవ్విస్తూ కాసేపు సందడి చేసారు. మహేష్ కిది 25వ సినిమా అయినా , ఆయన వయసు మాత్రం 25లాగే కనిపిస్తోంది. ప్రతి యాక్టర్ కు ఒక ఫేవరేట్ కెమేరా యాంగిల్ ఉంటుంది. తనకి మాత్రం 360 డిగ్రీస్... ఏ కోణంలో చూపించినా అందంగానే కనపడతాడు. ఒకప్పుడు చిన్నోడు నాపై కోపంతో పూలకుండీని తన్నాడు. అలా తన్నినప్పుడు ఆ సినిమా ఎన్ని రికార్డ్స్ బద్దలు కొట్టిందో తెలుసు. మళ్లీ ఈ సినిమాతో అన్నీ రికార్డ్ లు తన్నేయాలని కోరుకుంటున్నా. మే 9న ఒక మంచి సినిమా చూడబోతున్నామన్నా ఆశాభావంతో ఉన్నానంటూ చెప్పుకొచ్చారు.
Also Read