మహర్షి... మూడు అవతారాలు
on Apr 10, 2019
రిషి... ఓ స్టూడెంట్, కాలేజీలో!
రిషి... ఓ శ్రీమంతుడు, విదేశాల్లో!
రిషి... ఓ సగటు మనిషి, జీవితంలో!
రిషిలో ఈ మూడు కోణాలు 'మహర్షి' సినిమాలో మనకు కనిపిస్తాయి. రిషిగా మూడు అవతారాల్లో మహేష్ బాబు తెరపై కనిపించనున్నారు. సినిమా కథ కూడా మూడు డిఫరెంట్ టైమ్ ఫ్రేమ్స్ లో సాగుతుంది. జీవితం ఒక ప్రయాణం అయితే... రిషి కుమార్ ప్రయాణమే ఈ 'మహర్షి'. కాలేజీలో రిషి స్నేహితుడిగా 'అల్లరి' నరేష్ కనిపించనున్నారు. వీరిద్దరి మధ్య స్నేహం రిషి ప్రయాణంలో ఎలాంటి మార్పులు తీసుకు వచ్చింది? ప్రయాణాన్ని ఎలా మార్చింది? అనేది ఆసక్తికరంగా ఉంటుందట. మహేష్ బాబు హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమా టీజర్ ఇటీవల విడుదలైంది. ప్రేక్షకుల నుంచి టీజర్ కు అద్భుత స్పందన లభిస్తోంది. అభిమానుల్లో సినిమాపై అంచనాలు పెరిగాయి. ఆ అంచనాలను అందుకుంటామని దర్శకుడు వంశీ పైడిపల్లి ధీమా వ్యక్తం చేస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ స్వరపరిచిన 'ఛోటీ ఛోటీ' బాతే పాట ఇప్పటికీ విడుదలైంది త్వరలో మిగతా పాటలను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. మే 9న సినిమా విడుదల కానున్న సంగతి తెలిసిందే.