అమితాబ్ వీడియోతో అమితానందంలో చరణ్!!
on Mar 27, 2019
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈ రోజు పుట్టిన రోజు జరపుకుంటోన్న సంగతి తెలిసిందే. అయితే బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ బెస్ట్ విసెష్ తెలుపుతూ రామ్ చరణ్ కు ఒక వీడియో రిలీజ్ చేశారు. ఆ వీడియోను రామ్ చరణ్ భార్య ఉసాసన సోషల్ మీడియా లో షేర్ చేశారు. ప్రస్తుతం ఇది వైరల్ అవుతోంది. ఆ వీడియోలోని సందేశం ఏమిటంటే `చరణ్.. దిస్ ఈజ్ అమితాబ్. మార్చి 27 ఈ రోజు నీ పుట్టిన రోజు. నా నుంచి అలాగే నా ముంబై కుటుంబం నుంచి నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆల్ ది వెరీ బెస్ట్. మున్ముందు నీకు మరిన్ని విజయాలు దక్కాలని కోరుకుంటున్నా. నీ వయసెంతో నాకు తెలీదు కానీ.. నిన్ను చూసిన ప్రతిసారీ నాకు 18 ఏళ్ల కుర్రాడిలాగే కనిపిస్తావు. నీ మాతృ భాషలో చెబుతున్నా.. నీకు పుట్టిన రోజు శుభాకాంక్షలు` అంటూ శుభాకంక్షలు తెలిపారు బిగ్ బి. లాస్ట్ ఇయర్ చరణ్ బర్త్ డే రోజునే `సైరా` షూటింగ్ లో పాల్గొన్నాడట అమితాబ్. ఇటీవలే సైరాలో బిగ్ బి పోర్షన్ పూర్తయింది. ఈ షూటింగ్ లో చరణ్, అమితాబ్ కు చాలా దగ్గరయ్యాడట. ఈ సినిమా రిలీజ్ కోసం ఎంతో ఆత్రుతగా, ఆసక్తిగా ఎదురు చూస్తున్నా అంటూ షూటింగ్ చివరి రోజు అమితాబ్ చిత్ర యూనిట్ కు చెప్పారంటే.. సినిమా ఏ స్థాయిలో ఉండబోతందో అర్థం చేసుకోవచ్చు.