`మజిలీ` రిలీజ్ కష్టమే!!
on Mar 12, 2019
మ్యారేజ్ తర్వాత చైతు, సామ్ లు కలిసి నటిస్తోన్న చిత్రం `మజిలీ`. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ ఫైనల్ దశలో ఉంది. అయితే ఈ సినిమాను మొదట ఏప్రిల్ 5న విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు నిర్మాతలు. కానీ ఇప్పడు ఆ రోజు మజిలీ రిలీజ్ కష్టమే అంటున్నారు. సమ్మర్ కావడంతో కలెక్షన్స్ బావుంటాయని నిర్మాతలు ఆ డేట్ ను ఫిక్స్ చేశారు. ఇంతలో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎలక్షన్స్ ఏప్రిల్ 11న అంటూ నోటిఫికేషన్ వచ్చింది. దీంతో దర్శక నిర్మాతలు ఆలోచనలో పడ్డారట. ఎలక్షన్స్ టైమ్ లో కలెక్షన్స్ మీద ప్రభావం పడే అవకాశం ఉంటుంది కాబట్టి సినిమాను పోస్ట్ పోన్ చేయాలని భావిస్తున్నారని తెలుస్తోంది. ఈ రెండు మూడు రోజుల్లో ఒక నిర్ణయానికి వచ్చే అవకాశాలున్నాయి. ఇక ఇప్పటికే ఎలక్షన్స్ వల్ల ` జెర్సీ` సినిమాను ఏప్రిల్ 19కు పోస్ట్ పోన్ చేసిన సంగతి తెలిసిందే. మరి మజిలీ సినిమాను కూడా అలా పోస్ట్ పోన్ చేస్తారా? లేకుంటే మొదట అనుకున్న డేట్ కే రిలీజ్ చేస్తారా? అన్నది తెలియాల్సి ఉంది.