దసరాకు 'డిస్కో రాజా'
on Mar 12, 2019
దసరా పండక్కి తన సినిమాను విడుదల చేయాలని రవితేజ నిర్ణయించుకున్నాడు. 'ఎక్కడికి పోతావు చిన్నవాడా', 'ఒక్క క్షణం' సినిమాల ఫేమ్ విఐ ఆనంద్ దర్శకత్వంలో రవితేజ హీరోగా నటిస్తున్న సినిమా 'డిస్కో రాజా'. 'ఆర్.ఎక్స్100' ఫేమ్ పాయల్ రాజ్ పుత్, 'నన్ను దోచుకుందువటే' ఫేమ్ నభా నటేష్ హీరోయిన్లు. రవితేజతో 'నెల టికెట్' నిర్మించిన రామ్ తాళ్లూరి ఈ సినిమాకు నిర్మాత. సైన్స్ ఫిక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందుతోన్న ఈ సినిమాను దసరాకు విడుదల కానుంది. త్వరలో విడుదల తేదీ ప్రకటించనున్నారు. రెండేళ్ల క్రితం దీపావళికి 'రాజా ది గ్రేట్' సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు రవితేజ. అది విజయం సాధించింది. తరవాత వచ్చిన సినిమాలు ఏవీ విజయం సాధించలేదు. దాంతో ఏదో ఒక పండక్కి సినిమాను విడుదల చేస్తే బావుంటుందని దసరాకు వస్తున్నట్టున్నాడు, ఈ 'డిస్కో రాజా'తో పాటు సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో తమిళ 'తేరి' రీమేక్ షూటింగునూ ప్యారలల్ గా చేయడానికి రవితేజ ప్లాన్ చేశాడు.