బన్నీ-సుక్కు... హ్యాట్రిక్!
on Mar 4, 2019
అల్లు అర్జున్ అభిమానులకు సర్ ప్రైజ్ ఇచ్చాడు. మహా శివరాత్రి సందర్భంగా కొత్త సినిమా వివరాలు ప్రకటించాడు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో సుకుమార్ దర్శకత్వంలో సినిమా చేయనున్నట్టు తెలిపాడు. కథానాయకుడిగా అల్లు అర్జున్ కి 20 వ చిత్రమిది. సుకుమార్ దర్శకత్వంలో మూడోది. ఆర్య, ఆర్య 2 సినిమాల తరవాత హ్యాట్రిక్ సినిమా ఇది. ఆగస్టులో ఈ సినిమా షూటింగ్ మొదలు కానుంది.
ఆల్రెడీ అల్లు అర్జున్ ఓ సినిమా అంగీకరించాడు. త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా చేయనున్నాడు. ఈ నెలలో ఈ సినిమా షూటింగ్ మొదలు కానుంది. జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి సినిమాల తరవాత త్రివిక్రమ్ దర్శకత్వంలో బన్నీకి హ్యాట్రిక్ సినిమా ఇది. కథానాయకుడిగా 19 వ సినిమా. దీని తరవాత సుకుమార్ దర్శకత్వంలో చేయనున్న సినిమా కూడా దర్శకుడితో హ్యాట్రిక్ సినిమా కావడం విశేషం! నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా సినిమా తరవాత చాలా రోజులు విరామం తీసుకున్న అల్లు అర్జున్, బ్యాక్ టు బ్యాక్ సినిమాలు ప్రకటించడం అభిమానులకు సంతోషంగా ఉంది.