మహర్షి' టీమ్‌పై మహేష్ ఫ్యాన్స్ ఫైర్!
on Mar 4, 2019
'మహర్షి' టీజర్ ఎప్పుడు విడుదల చేస్తారు??... వుయ్ వాంట్ మహర్షి టీజర్ అప్ డేట్!... వేకప్ ఎస్వీసీ... వేకప్ పైడిపల్లి... హ్యాష్ టాగ్స్ తో మహేష్ ఫ్యాన్స్ ఆదివారం అంతా ట్విట్టర్ లో హడావుడి చేశారు. మహేష్ బాబు హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో దిల్ రాజు, అశ్వినీదత్, పివిపి నిర్మిస్తున్న సినిమా మహర్షి. ఏప్రిల్ 25న సినిమా విడుదల చేయనున్నట్టు ఇటీవల ప్రకటించారు. అంతే తప్ప.. కొత్త లుక్ ఏదీ విడుదల చేయలేదు. అప్పుడెప్పుడో విడుదల చేసిన మహేష్ రెండు లుక్స్ తప్ప మరో లుక్ ఎప్పుడు విడుదల చేస్తారో ఎవరికీ తెలీదు. సినిమాలో హీరో హీరోయిన్ కౌగిలించుకున్న స్టిల్ కూడా లీకైంది తప్ప.. అఫిషియల్ గా విడుదల చేసింది కాదు. ఆగస్టులో విడుదల కానున్న సాహో పబ్లిసిటీ ఆల్రెడీ స్టార్ట్ చేశారు. ప్రభాస్ పుట్టినరోజుకి ఒక మేకింగ్ వీడియో, హీరోయిన్ శ్రద్ధా కపూర్ పుట్టినరోజుకి మరో మేకింగ్ వీడియో విడుదల చేశారు. ఏప్రిల్ నెలాఖరున విడుదల కానున్న మహర్షి అప్ డేట్స్ ఇంకా స్టార్ట్ కాలేదు. ఈ నేపథ్యంలో మహేష్ అభిమానులు 'మహర్షి' టీమ్‌పై ఫైర్ అయ్యారు. ఏదో ఒక అప్ డేట్ కావాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. మధ్యలో సందట్లో సడేమియా అన్నట్టు నాని అభిమానులు జెర్సీ అప్ డేట్ కావాలని కాసేపు ట్రెండ్ చేశారు. మహేష్ అభిమానులు మాత్రం అదే పనిగా మహర్షి టీమ్ ని టార్గెట్ చేశారు. ఆదివారం మహేష్ అభిమానులు నిర్మాణ సంస్థలు, చిత్ర బృందంపై ఆగ్రహం వ్యక్తం చేస్తే... ఈ రోజు అల్లు అర్జున్ అభిమానులు అదే పని చేస్తున్నారు. అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో గీతా ఆర్ట్స్ సంస్థ, హారిక అండ్ హాసిని క్రియేషన్స్ సంస్థ సంయుక్తంగా ఒక సినిమా నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఆ సినిమా అప్ డేట్ కావాలని ట్రెండింగ్ స్టార్ట్ చేశారు.