డిజాస్టర్ దిశగా `మహానాయకుడు`!!
on Feb 25, 2019
ఎన్టీఆర్ బయోపిక్ ఫస్ట్ పార్ట్ కు ఫస్ట్ వీక్ పూర్తయ్యే రోజుకి గ్రాస్ 20 కోట్లకు పైగా రాగా 14 కోట్ల షేర్ వచ్చిందన్న విషయం తెలిసిందే. ఇక ఈ నెల 22న విడుదలైన ఎన్టీఆర్ బయోపిక్ సెకండ్ పార్ట్ `మహానాయకుడు` సినిమా పరిస్థితి అత్యంత దారుణంగా ఉందట. అసలు ఇది బాలకృష్ణ సినిమానేనా అన్న సందేహాలు వస్తున్నాయట డిస్ట్రిబ్యూటర్స్ కు. కనీసం ఆదివారం కూడా ఈ సినిమా థియేటర్ వైపు వెళ్లే వాళ్లు కనిపించడం లేదట. కలెక్షన్స్ చూసి అంత ఖంగుతింటున్నారట. మరి ఈ విధమైన వసూళ్లు వస్తున్నాయని ఎవరూ ఊహించలేదట. సినిమాకు టాక్ బాగానే ఉందని వచ్చినప్పటికీ ఆ థియేటర్స్ వైపు కన్నెత్తి చూడటానికి కూడా ఎవరు ఇష్టపడటం లేదట. దీనికి కారణాలు ఏమైనా ఎన్టీఆర్ బయోపిక్ ఇప్పుడు డిజాస్టర్ కా బాప్ అనే రేంజ్ లో పేరు తెచ్చుకునేలా ఉందని నందమూరి అభిమానులు బాధపడుతున్నారట. మరికొన్ని చోట్ల అయితే థియేటర్స్ రెంట్ కూడా రాబట్టని సిట్యుయేషన్ లో సినిమా ఉంది. ఇక ఓవర్సీస్ కలెక్షన్స్ గురించి అయితే మాట్లాడుకోకపోవడం మర్యాదగా ఉంటుందట. ఫుల్ రన్ పూర్తయ్యే వరకు ఐదారు కోట్లైనా రాబడుతుందా లేదా అన్న సందేహం ఇప్పటికే అందరిలో ఉంది. ఏది ఏమైనా ఎన్టీఆర్ లాంటి మహానాయకుడికి ఇది నిజంగా ఘోరమైన పరాభావం మిగిల్చేలాగే ఉంది. చూద్దాం ఎలా ఉంటుందో మరి.