`గ్యాంగ్ లీడర్ `గా వస్తున్ననాని!
on Feb 25, 2019
`గ్యాంగ్ లీడర్ ` చిరంజీవి కెరీర్ లో ఓ మైలురాయిగా నిలిచిన చిత్రం. మరి ఆ టైటిల్ తో నాచురల్ స్టార్ నాని తన 24వ సినిమాతో మన ముందుకు వస్తున్నాడు. విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో ఇటీవల నాని ఓ సినిమా ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఆది వారం ఆయన పుట్టిన రోజు సందర్భంగా టైటిల్ ని ప్రకటించింది మైత్రీ మూవీ మూకర్స్ సంస్థ. గతంలో వచ్చి చిరు కు బ్లాక్ బస్టర్ ఇచ్చిన `గ్యాంగ్ లీడర్` టైటిల్ నాని సినిమాకు కన్ ఫర్మ్ చేసారు. దీంతో నాని అభిమానులు ఎంతో హ్యాపీగా ఫీలయ్యారు. ఇప్పటికే ఈసినిమాలో ఆర్ ఎక్స్ 100 హీరో కార్తికేయ నటిస్తోన్న సంగతి తెలిసిందే. అయితే తన పాత్ర నెగిటివ్ గా ఉండబోతున్నట్లు సమాచారం. ఇందులో నాని రైటర్ గా నటిస్తున్నాడట. ఇందులో ముగ్గురు నలుగురు హీరోయిన్స్ నటించే అవకాశాలున్నాయి. అలాగే ఈ చిత్రం కొరియన్ లాంగ్వేజ్ లో రూపొందిన ఓ సినిమా ఇన్ స్పిరేషన్ తో తెరకెక్కిస్తున్నారని కూడా తెలుస్తోంది. ఆగస్టులో ఈ సినిమాను విడుదల చేయనున్నారు. మరి చిరంజీవి టైటిల్ తో వస్తోన్న నాని ప్రేక్షకులను ఎంత వరకు ఆక్టుకుంటాడో చూద్దాం అంటున్నారు సినీ పండితులు.