ప్రేమికుల రోజు కానుకగా చై-సామ్‌ల గిఫ్ట్!!
on Feb 13, 2019
రియల్ లైఫ్ లో భార్యభర్తలైన నాగచైతన్య-సమంత రీల్ లైఫ్‌లో కూడా భార్యభర్తలుగా నటిస్తోన్న చిత్రం `మజిలీ`. శివ నిర్వాణ డైరక్షన్ లో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో వీరిద్దరికీ మధ్య తగాదాలు ఎక్కువగా ఉంటాయి ఓ ఇంటర్వ్యూల్ తెలిపాడు. అలాగే చైతన్య టు డిఫరెంట్ లుక్స్ లో కనిపిస్తున్నాడని సమాచారం అందుతోంది. అందులో ఒకటి క్రికెటర్ గా అని తెలుస్తోంది. ప్రజంట్ షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోన్న ఈ చిత్రం ఏప్రిల్ 5న రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు ఫస్ట్ లుక్, సెకండ్ లుక్ కు మంచి పేరు వచ్చింది. అయితే ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ను లవర్స్ డే కానుకగా ఫిబ్రవరి 14న రిలీజ్ చేయడానికి ఓ పోస్టర్ ను కూడా రిలజ్ చేశారు. పెళ్లి తర్వాత చైతు, సమంత కలిసి నటించి సినిమా కావడంతో ఇప్పటికే ఈ సినిమా ఎక్స్ పెక్టేషన్స్ పెరిగాయి. మరి సినిమా ఆ అంచనాలను అందుకుంటుందో లేదే చూద్దాం. హరీష్ పెద్ది, సాహు గారపాటి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. బాలీవుడ్ నటి దివ్యాంశ కౌశిక్ ఓ కీలక పాత్ర చేస్తుందట. గోపీసుందర్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు. ఈ ప్రేమికుల రోజు కానుకగా చై, స్యామ్ లు తమ అభిమానులకు మజిలీ టీజర్ గిఫ్ట్ ఇస్తున్నారన్నమాట.