బాలకృష్ణ vs నయనతార
on Feb 12, 2019
బాలకృష్ణతో నయనతారది హిట్ కాంబినేషన్. ‘సింహా’, ‘శ్రీరామరాజ్యం’, ‘జై సింహా’ సినిమాలు బాక్సాఫీస్ హిట్స్‌గా నిలిచాయి. వీళ్ళిద్దరి జంట చూడముచ్చటగా ఉందనే ప్రశంసలు లభించాయి. ఇద్దరూ ముచ్చటగా మూడు విజయాలు అందుకున్నారు. మరి, ఇద్దరూ వేర్వేరు సినిమాలతో బాక్సాఫీస్ దగ్గరకు వస్తే ఎలా ఉంటుందో? ఎన్టీఆర్ బయోపిక్ సెకండ్ పార్ట్ ‘యన్.టి.ఆర్ – మహానాయకుడు’ సినిమాను ఈ నెల 22న విడుదల చేయనున్నట్టు ఈ రోజు ప్రకటించారు. తండ్రి నందమూరి తారక రామారావుగా తనయుడు బాలకృష్ణ నటించి, నిర్మించిన ఈ సినిమా విడుదల రోజునే నయనతార ప్రధాన పాత్రలో నటించిన లేడీ ఓరియెంటెడ్ సినిమా ‘అంజలి సి.బి.ఐ’ కూడా విడుదల కానుంది. తమిళంలో విజయం సాధించిన ‘ఇమైక్క నోడిగల్’ సినిమా డబ్బింగ్ వెర్షన్ ఇది. ఆల్రెడీ అమెజాన్‌లో కూడా తమిళ వెర్షన్ వచ్చింది. సబ్ టైటిల్స్‌తో మెట్రో అండ్ అర్బన్ ఆడియన్స్ చూశారు. తెలుగులో సినిమాకు ఎటువంటి స్పందన వస్తుందో? ఎన్టీఆర్ బయోపిక్ ఫస్ట్ పార్ట్‌కి ఆశించిన స్పందన రాలేదు. ఈ నేపథ్యంలో సెకండ్ పార్ట్‌కి ఎటువంటి స్పందన వస్తుందోనని పరిశ్రమ వర్గాలు ఆసక్తిగా చూస్తున్నాయి. ‘యన్.టి.ఆర్ – మహానాయకుడు’, ‘అంజలి సి.బి.ఐ’ సినిమాలతో బాక్సాఫీస్ బరిలో ఫిబ్రవరి 22న దిగుతున్న బాలకృష్ణ, నయనతార విజయాలు సాధించాలని ఆశిద్దాం!