నిర్మాతగా `కాజల్` !!
on Feb 11, 2019
కాజల్ అగర్వాల్ యువతరం కలలరాణి . ఈ నెల 15 తో ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి పుష్కరకాలం పూర్తి కావస్తోంది. మొదటి తెలుగు చిత్రం `లక్ష్మి కళ్యాణం` రోజుల్లో ఎలా ఉందో ఇప్పటికీ అలాగే వన్నె తరగని అందంతో అభిమానులను పెంచుకుంటూ . అగ్ర కథానాయికగా దూసుకుపోతోంది కాజల్. దాదాపు టాప్ హీరోలందరితోనూ ఆడిపాడిన ఈ ముద్దుగుమ్మ . అతి త్వరలో సరికొత్త అవతారం ఎత్తడానికి సిద్దమవుతోందని టాక్.
టాలీవుడ్ లో వినిపిస్తున్న కథనాల ప్రకారం . కాజల్ త్వరలోనే నిర్మాణం రంగంలోకి ఎంటర్ అవుతోందని సమాచారం. `కె.ఎ.వెంచర్` పేరుతో కాజల్ ఓ బేనర్ ను పెట్టి , తన అభిరుచికి తగ్గట్టుగా కాన్సెప్ట్ ఓరియెంటెడ్ మూవీస్ అందించనుందని ఫిల్మ్ నగర్ వర్గాల కథనం. గత ఏడాది `అ!` చిత్రాన్ని రూపొందించి విమర్శకుల ప్రశంసలు పొందిన ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో ఈ సినిమా ప్లాన్ చేసిందట కాజల్. త్వరలోనే కాజల్ సొంతం నిర్మాణం సంస్థ సంబంధించిన అధికారిక ప్రకటన రావచ్చు. కథానాయికగా శిఖర స్థాయికి చేరుకున్న కాజల్. నిర్మాణం రంగంలోనూ అదే స్థాయికి చేరుకోవాలని కోరుకుందాం!