హాలీవుడ్‌కి 'రానా'!?
on Feb 1, 2019
'నేను హాలీవుడ్‌కి రానా..?' అని రానా దగ్గుబాటి ఎవర్నీ అడగటం లేదు. హాలీవుడ్ వాళ్ళే రానాను మా సినిమాలో నటించమని పిలుస్తున్నారని తెలిసింది. 'బాహుబలి'తో రానా దేశవ్యాప్తంగా ఫ్యాన్ ఫాలోయింగ్ భారీగా పెరిగింది. అలాగే, జపాన్ వంటి దేశాల్లోనూ రానాకు అభిమానులు ఉన్నారు. ఇండియన్ యాక్టర్ అనిపించుకోవడంతో రానా దగ్గుబాటిని కొంతమంది హాలీవుడ్ దర్శక నిర్మాతలు తమ సినిమాల్లో నటించమని సంప్రతిస్తున్నారట. 'బాహుబలి'కి ముందు హిందీ సినిమాల్లో నటించడమూ అతడికి ప్లస్ అయ్యింది. అన్నీ కుదిరితే త్వరలో ఓ హాలీవుడ్ సినిమాకు రానా సంతకం చేస్తారని ఫిలింనగర్ టాక్. ప్రస్తుతం 'హాథీ మేరే సాథీ' సినిమాలో చేస్తున్నాడీ యాక్టర్. అలాగే, గుణశేఖర్ దర్శకత్వంలో నటించనున్న 'హిరణ్య కశ్యప' సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. పలువురు హిందీ నటీనటులు హాలీవుడ్ సినిమాల్లో నటించారు. తెలుగు నుంచి ఇప్పటివరకూ ఎవరూ హాలీవుడ్ వెళ్ళినట్టు లేరు. రానా గనుక హాలీవుడ్ సినిమాకు సంతకం చేస్తే తెలుగు నుంచి ఈతరంలో హాలీవుడ్ వెళ్లిన ఫస్ట్ యాక్టర్ అవుతాడు.