కొరటాల సినిమా పై క్లారిటీ వచ్చింది!!!
on Jan 21, 2019
మెగాస్టార్ చిరంజీవి, కొరటాల శివ సినిమాపై గతకొన్ని రోజులుగా వార్తలు వస్తూనే ఉన్నాయి. త్రివిక్రమ్ తో సినిమా ఉంటుందని తెలిసినప్పపటి నుంచీ కొరటాల శివతో సినిమా ఉండటం లేదనీ, అది ఇంకా లేట్ అయ్యే అవకాశాలున్నాయనీ...ఏ వేవో రూమర్స్ వినిపించాయి. అయితే వీటన్నింటిపై కొణిదెల ప్రొడక్షన్స్ , మ్యాట్ని ఎంటర్ టైన్ మెంట్స్ ఓ ప్రకటన విడుదల చేసాయి. `సైరా` పూర్తయిన వెంటనే ఓ సినిమా ప్రారంభం కానుందని అఫీషియల్ గా ప్రకటించేశారు. ఈ మూవీ ఆగిపోయిందని వస్తున్న వార్తలను ఖండిస్తూ..ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయని తెలిపారు. ఇప్పటికే స్ర్కిప్ట్ ను లాక్ కూడా చేసామనీ..వస్తోన్న రూమర్స్ అన్నింటికీ చెక్ పెట్టేశారు చిత్ర యూనిట్. చిరంజీవి ప్రజంట్ సైరా షూటింగ్ లో బిజీ బిజీగా ఉన్నారు. కొరటాలతో మూవీ అనంతరం త్రివిక్రమ్ తో సినిమ చేయనున్నారు.