త్రివిక్రమ్,బన్నీ సినిమాలో మరో హీరో!!
on Jan 7, 2019
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో మరో హీరో నటించబోతున్నాడ. ఎవరా హీరో అనే వివరాల్లోకి వెళితే .... కమెడియన్ గా తనకంటూ ఓ స్థానం సంపాదించుకుని , ఆ తర్వాత హీరోగా సినిమాలు చేయడం మొదలుపెట్టాడు సునీల్. హీరోలుగా అతనికి రెండు, మూడు సినిమాలు బాగానే వర్కవుట్ అయ్యాయి కానీ , మిగతా సినిమాలు అతని కెరియర్ కి పెద్దగా ఉపయోగపడలేదు. దాంతో మళ్లీ కామెడీ క్యారెక్టర్స్ , కీలక పాత్రలు చేయడం మొదలుపెట్టాడు సునీల్. `సిల్లీ ఫెలోస్` , `,అరవిందసమేత వీరరాఘవ`, `అమర్ అక్బర్ ఆంటోని`,`పడి పడి లేచే మనసు`చిత్రాల్లో కామెడీ క్యారెక్టర్ చేసాడు.ఇప్పుడు అల్లు అర్జున్, త్రివిక్రమ్ సినిమాలో ఓ మంచి పాత్ర చేయబోతున్నాడట సునీల్. ఈ విషయాన్ని స్వయంగా సునీల్ తెలియజేసాడు. మరి సునీల్ కోసం త్రివిక్రమ్ ఎలాంటి పాత్ర క్రియేట్ చేసాడో, ఈ పాత్ర ద్వారా అయినా సునీల్ కెరియర్ మళ్లీ ఊపందుకుంటుందేమో వేచిచూద్దాం.