బిగ్ బాస్3 హోస్ట్‌గా వెంకటేష్!!
on Jan 4, 2019
విక్టరీ వెంకటేష్ ప్రజంట్ వరుస సినిమాలతో బిజీ బిజీగా ఉన్నాడు. అయితే వెంకీ బుల్లి తెరపై మొరవనున్నాడంటూ సోషల్ మీడియాలో వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. మా టీవీలో ప్రసారం కానున్న బిగ్ బాస్ మూడవ సీజన్ కు వెంకటేష్ హోస్ట్ గా వ్యవహరించనున్నారట. ఇటీవలే బిగ్ బాస్ నిర్వాహకులు వెంకటేష్ ని సంప్రదించినట్లు తెలుస్తోంది. దీనికి వెంకీ కూడా సుముఖంగానే ఉన్నట్లు తెలుస్తోంది. త్వరలో అధికారికంగా ప్రకటించే అవకాశాలున్నాయి. బిగ్ బాస్ రియాలిటీ షో తొలి సీజన్ కు ఎన్టీఆర్ వ్యహరించిన సంగతి తెలిసిందే. రెండో సీజన్ కు నాచురల్ స్టార్ నాని హోస్ట్ గా వ్యవహరించాడు. ఫ్యామిలీ ఫాలోయింగ్ ఎంతో ఉన్న వెంకీ అయితే ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ కు బిగ్ బాస్ షోకు దగ్గరవుతారని వెంకటేష్ ని హోస్ట్ గా తీసుకోవడానికి నిర్వాహకులు ప్రయత్నిస్తున్నారని సమాచారం.