ఎన్టీఆర్తో అర్జున్ రెడ్డి దర్శకుడు!!
on Jan 4, 2019
సందీప్ రెడ్డి `అర్జున్ రెడ్డి` సినిమా తో క్రియేట్ చేసిన సెన్సేషన్ అంతా ఇంతా కాదు. బోల్డ్ కంటెంట్ తో ఒక ట్రెండ్ సెట్టర్ గా నిలిచిందా చిత్రం. సందీప్ రెడ్డి నేచరల్ గా తీసిన ఈ చిత్రంలోని డైలాగ్స్, సాంగ్స్ , టేకింగ్ ప్రతిది సినిమాకు హైలెట్ గా నిలిచాయి. ఈ సినిమా విజయ్ దేవరకొండను ఓ స్ఠాయిలో నిలిబెట్టింది. అయితే ఈ సినిమా తర్వాత ఇప్పటికి విజయ్ దేవరకొండ మూడు సినిమాలు చేసినప్పటికీ ...దర్శకుడు సందీప్ రెడ్డి మాత్రం చాలా గ్యాప్ తీసుకున్నాడు. అప్పట్లో మహేష్ బాబుతో సినిమా అవకాశం వచ్చినా...ఎందుకో అది పట్టాలెక్కలేదు. దీంతో `అర్జున్ రెడ్డి` చిత్రాన్ని హిందీలో రీమేక్ చేసే పనిలో ఉన్నాడు. కబీర్ సింగ్ పేరుతో షాహిద్ కపూర్ హీరోగా చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా సందీప్ కిషన్ తదుపరి సినిమా గురించి వార్తలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. అవి ఏమిటంటే...యంగ్ టైగర్ ఎన్టీఆర్ కోసం సందీప్ రెడ్డి ఓ మాంచి లవ్ స్టోరిని రెడీ చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఎన్టీఆర్ తో చర్చలు కూడా జరిపాడట దర్శకుడు. అయితే ప్రస్తుతం ఎన్టీఆర్ రాజమౌళి దర్శకత్వంలో `ఆర్ ఆర్ ఆర్` సినిమాలో నటిస్తున్నాడు. అన్నీ కుదిరితే ఆర్ ఆర్ ఆర్ తర్వాత ఎన్టీఆర్ చేయబోయే సినిమా సందీప్ రెడ్డితో అయి ఉంటుందనేది ఫిలింనగర్ వార్తలు.