యమా స్పీడులో బాలయ్య!!!
on Jan 2, 2019
బాలయ్య మాంచి స్పీడులో యంగ్ హీరోలతో పోటీ పడుతూ దూసుకెళ్తున్నాడు. ఇటీవలే బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ సినిమా ఎన్బీకే బేనర్ లో చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించినట్లు తెలిసిందే. అయితే ఇదిలా ఉంటే మరొక సినిమా కూడా ఓ యువ దర్శకుడి తో చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. ఆ దర్శకుడు ఎవరో కాదు పటాస్ దర్శకుడు అనిల్ రావిపూడి. లేటెస్ట్ గా `ఎఫ్ 2` సినిమాకు డైరక్షన్ చేశాడు. ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా మాట్లాడుతూ అనిల్ రావిపూడి మాట్లాడుతూ...`గత మూడేళ్ల నుంచి బాలయ్య గారితో టచ్ లో ఉన్నాను. ఓ ప్రాజెక్ట్ గురించి డిస్కస్ చేసుకుంటున్నాము. బోయపాటి శ్రీనుగారి తర్వాత బాలయ్య గారు సినిమా చేసే అవకాశం దక్కుంతుందన్న నమ్మకంతో ఉన్నా అంటూ చెప్పుకొచ్చాడు. ఇదిలా ఉంటే ఇప్పటికే బాలయ్య కి సబ్జెక్ట్ చెప్పడం గ్రీన్ సిగ్నల్ కూడా ఇవ్వడం జరిగిపోయినట్లు తెలుస్తోంది. అన్నీ కుదిరితే బాలయ్య 106 సినిమా అనిల్ రావిపూడితో ఉంటుంది. ఇక బాలయ్య తన 103,104 ఎన్టీర్ కథా నాయకుడు, మహానాయకుడు బయోపిక్ చిత్రాల బిజీలో ఉన్నాడు. ఇక బోయపాటితో చేయబోయే తన 105 చిత్రాన్ని ఫిబ్రవరి ఎండింగ్ లో షూటింగ్ ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.