నిర్మాణ రంగంలోకి మహేష్ బాబు!!
on Dec 24, 2018
సూపర్ స్టార్ కృష్ణ అంటేనే ప్రయోగాలు, సాహసాలకు మారుపేరు అంటారు. ఇప్పుడు ఆయన కుమారుడు మహేష్ కూడా ఆయన బాటలో నడుస్తున్నారు. ఒక వైపు హీరోగా వరుసగా సినిమాలు, యాడ్స్ చేస్తూ ఎప్పుడూ బిజీగా ఉండే మహేష్ బాబు ఇటీవలే ఏఎమ్బి మల్టీప్లెక్స్ నిర్మించి బిజినెస్ రంగంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఇలా బిజినెస్ రంగంలోకి అడుగుపెట్టిన మహేష్ నిర్మాణ రంగంలోకి అడుగుపెడుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు సొంత సినిమాలకు భాగస్వామిగా వ్యవహరించిన మహేష్ ఇప్పుడు వెబ్ సిరీస్ తో పాటు లో- బడ్జెట్ ఫిలింస్ కూడా నిర్మించాలన్న ప్లాన్ లో ఉన్నట్లు తెలుస్తోంది.
ఇటీవలే ఓ టాప్ డిజిటల్ మీడియా సంస్థతో చర్చలు కూడా జరిపారట. న్యూ టాలెంట్ ను ప్రోత్సహించడానికి మహేష్ ప్రొడక్షన్ హౌసును ప్రారంభించాలని డిసైడ్ అయినట్లు సమాచారం. ఇప్పటికే వెబ్ సిరీస్ కు సంబంధించిన స్టోరీస్ కూడా వింటున్నట్లు తెలుస్తోంది. అన్నీ కుదిరితే వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఓ కొత్త కుర్రాడి దర్శకత్వంలో ఓ డిఫరెంట్ కాన్సెప్ట్ తో వెబ్ సిరీస్ స్ట్టార్ చేయనున్నారట మహేష్. . ప్రస్తుతం ఈయన.. వంశీ పైడి పల్లి దర్శకత్వంలో మహర్షి చిత్రంలో నటిస్తున్నాడు . వచ్చే ఏడాది సమ్మర్ లో ఈ సినిమాను రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
Also Read