ప్రభాస్ ఫామ్ హౌసులో పార్టీలే పార్టీలు!
on Dec 24, 2018
``కాఫీ విత్ కరణ్`` సీజన్ 6లో పాల్గొన్న బాహుబలి త్రయం (ప్రభాస్,రానా, రాజమౌళిలు) పలు ఆస్తికర విషయాలను ప్రేక్షకుతలో పంచుకున్నారు. ఈ ఎపీసోడ్ కు సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అయిన సంగతి తెలిసిందే. ఆదివారం రాత్రి టెలికాస్ట్ అయిన కాఫీ విత్ కరణ్ ఎపిసోడ్ చాలా సరదాగా సాగింది. ర్యాపిడ్ ఫైర్ రౌండ్ లో కరణ్ పలు ఆస్తికర ప్రశ్నలను బాహుబలి టీమ్ ముందు ఉంచారు.
రానాల, ప్రభాస్, పెళ్లిపై స్పందిస్తూ...
ప్రభాష్, రానాల పెళ్ళి ఎప్పుడని కరణ్ రాజమౌళిని ప్రశ్నించారు.దానికి ఆయన స్పందిస్తూ. ప్రభాస్ ఎందుకు పెళ్లి చేసుకోవడం లేదంటే. అతడు చాలా లేజీ, పెళ్లి చూపులు, వెడ్డింగ్ కార్డలు పంచడం,పెళ్లి వేడుక ఇదంతా చాలా టైమ్ తీసుకుంటుందని అదంతా ప్రభాస్ చేయలేడని సరదాగా వ్యాఖ్యానించారు. ఇవన్నీ కాకుండా ఓ అమ్మాయితో మూవ్ ఆన్ కావచ్చు కదా అని కరణ్ ప్రశ్నించగా ...మధ్యలో రాజమౌళి కలగజేసుకుని `` ప్రభాస్ అలా చేయడనీ, పెళ్లి చేసుకోవడానికి మాత్రమే బద్ధకంగా ఉంటాడని`` సమాధానమిచ్చాడు. రానా మాత్రం ఏ వయసులో చేయాల్సినది ఆ వయసులో చేస్తున్నాడనీ...అందులో మ్యారేజ్ అనే పాయింట్ కూడా ఉందని చెప్పుకొచ్చాడు రాజమౌళి. ప్రభాస్ కి ఫుడ్ అంటే చాలా ఇష్టమనీ. తన ఫామ్ హౌసులో తన మిత్రులకు పెద్ద పెద్ద పార్టీలు ఇస్తుంటాడని చెప్పుకొచ్చాడు జక్కన్న. ఆద్యంతం ఇలా సరదా సరదాగా సాగిందీ కాఫీ విత్ కరణ్ ప్రోగ్రామ్.