విజయం సాధించాకే మొదలైన చిత్రం ఎన్టీఆర్ బయోపిక్
on Dec 22, 2018
బాలయ్య నటిస్తూ నిర్మిస్తోన్న చిత్రం `ఎన్టీఆర్` ఈ బయోపిక్ కథానాయకుడు, మహానాయకుడు రెండు భాగాలుగా వస్తోన్న విషయం తెలిసందే. అయితే ఈ చిత్ర ఆడియో వేడుక శుక్రవారం హైదరాబాద్ లో జరిగింది. నందమూరి కుటుంబమంతా ఈ వేడుకలో పాల్గొన్నది. అయితే మొదట్లో ఈ వేడుకకు బాలయ్య జూనియర్ ఎన్టీఆర్ ను ఆహ్వానించలేదు, కాబట్టి జూ. ఎన్టీఆర్ ఈ వేడుకకు వచ్చే అవకాశాలు లేవంటూ వార్తలు వచ్చాయి. అయితే ఆ వార్తలను కొట్టి పారేసేలా `ఎన్టీఆర్` ఆడియో వేడుకకు జూ.ఎన్టీఆర్ విచ్చేసాడు. అద్భుతంగా తాత, బాబాయ్‌ల గురించి మాట్లాడాడు.
``మా బాబాయ్ ని చూస్తుంటే పెద్దాయన గుర్తుకు వస్తున్నారు. ఆ మహా మనిషి కుటుంబంలో నేను కూడా ఒక సభ్యుడిని కావడం ఎంతో సంతోషం. ఈ రోజు నేను కుటుంబ సభ్యుడిలా మాట్లాడటానికి రాలేదు. ఓ మహానుభావుడు చేసిన త్యాగాల వల్ల లబ్ది పొందిన తెలుగువాడిగా మాట్లాడటానికి వచ్చాను. తెలిసి తెలియని వయసులో తాతయ్యగారు అని మహా మనిషిని సంభోందించిన నేను ...ఆయన గురించి తెలిసిన తర్వాత రామారావు అనో...అన్నగారు అనో సంభోదించడం మొదలు పెట్టాను. ఎందుకంటే ఆయన ఓ ఒక్క కుటుంబానికో చెందినవాడు కాదు. తెలుగువాడిగా పుట్టిన ప్రతి ఒక్కరికీ చెందిన ధృవతార. ఆయన గురించి ఎన్నోకథలు విన్నాను. నాన్న, అమ్మ, బాబాయ్ లు చెప్పినప్పుడు తెలుసుకునేవాడిని. అయితే ఇంకా తెలుసుకోవాల్సింది ఎతో ఉంది. వాల్మీకి రామాయణం రాసేటప్పుడు ఎవరో ఒక వ్యక్తి ఆయన్ను అడిగి ఉంటాడేమో `అయ్యా ధర్మం మూర్తిభవించేలా ...కనపడేలా నిలువెత్తు ధర్మంతో కనపడేలా ఏ మానువుడు లేడా` అని ఉంటాడు. ఎందుకు లేడు అడుగో శ్రీరామ చంద్రుడు అని చెప్పి ఆయన రామాయణం రాసి ఉంటాడు. ఆయన ఆ అవతారాన్ని వదిలేసాక మళ్లీ అలాంటి ధర్మమూర్తిని , ఒక గొప్ప వ్యక్తి ని చూడలేమా అంటే ...ఆ శ్రీరామచంద్రుడు కటాక్షంతో 1923 మే 28న నిమ్మకూరులో ఓ ధృవతార వెలిసింది. గొప్ప తండ్రే కాదు..గొప్ప బిడ్డేకాదు, గొప్ప నటుడే కాదు, గొప్ప నాయకుడే కాదు అంతకు మించి ఎంతో ఆయన. రేపొద్దున మా పిల్లలు ఎప్పుడైనా అలాంటి గొప్ప వారు ఉన్నారా? అంటే అప్పుడు నేను గర్వగా చెప్పుకుంటాను `ఇంకా పుట్టలేదు అని చెబుతా. కానీ మా తాత గురించి మీ తాత చేసిన చిత్రం ఉంది అని చూపించుకుంటా. ఆ మహానుభావుడి చరిత్రను భావితరాల వారికి తీసుకె|ళ్తున్న బాబాయ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ చిత్రం విజయం సాధించాలని నేను కోరుకోను. ఎందుకంటే ఈ చిత్రం విజయం సాధించాకే మొదలైంది. చరిత్రకు విజయాలు అపజయాలు ఉండవు. చరిత్ర సృష్టించడమే ఉంటుంది అంటూ అద్భుతంగా మాట్లాడి ఆహుతులను, నందమూరి అభిమానలు ఆనందంలో ముంచెత్తాడు తారక్.