సాహో @ ఆగస్టు 15
on Dec 17, 2018
యంగ్ రెబల్‌స్టార్ ప్రభాస్ అభిమానులు, భారతీయ సినిమా ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్న సినిమా 'సాహో'. ఎందుకంటే... 'బాహుబలి 2' తరవాత ప్రభాస్ నటిస్తున్న సినిమా. అంతే కాదు... హాలీవుడ్ స్థాయిలో తెరకెక్కుతున్న ఇండియన్ యాక్షన్ ఎంటర్టైనర్. 'సాహో' మేకింగ్ వీడియో విడుదల తరవాత సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. అయితే... చాలా రోజుల నుంచి ఈ సినిమా మేకింగ్‌లోనే ఉంది. ప్రభాస్ అభిమానులు మేకింగ్ వీడియోతో సంతోషపడినా... సినిమాను ఎప్పుడు విడుదల చేస్తారంటూ ఎప్పట్నుంచో అడుగుతున్నారు. ముందు 2019 వేసవిలో సినిమా విడుదల చేస్తారని వార్తలు వినిపించాయి. సమ్మర్లో 'సాహో ' విడుదల కావడం లేదు. స్వాతంత్ర్య దినోత్సవానికి చిత్రాన్ని విడుదల చేస్తున్నట్టు నిర్మాతలు, యువి క్రియేషన్స్ అధినేతలు వంశీ, ప్రమోద్ ఈ రోజు ప్రకటించారు. ఆగస్టు 15, 2019న 'సాహో' ప్రేక్షకుల ముందుకు రానుంది. 'రన్ రాజా రన్' ఫేమ్ సుజీత్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ హీరోయిన్. హిందీతో పాటు దక్షిణాది నటీనటులు నీల్ నితిన్ ముఖేష్, మురళీ శర్మ, అరుణ్ విజయ్, మందిరా బేడీ, ఎలివీన్ శర్మ తదితరులు సినిమాలో నటిస్తున్నారు.