నాని గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడట!!
on Nov 29, 2018
`మనం` చిత్రం ఫేమ్ విక్రమ్ కుమార్ హలో తర్వాత బన్నీతో అనుకున్నా కానీ , ఆ సినిమా సెట్టవ్వలేదు. అయితే తాజాగా నేచరల్స్టార్ నానికి స్టోరీ వినిపించాడట విక్రమ్ కుమార్. స్టోరీ విపరీతంగా నచ్చిన నాని వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం అందుతోంది. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. నాని పాత్రను డిఫరెంట్ గా డిజైన్ చేశాడట విభిన్న చిత్రాల దర్శకుడు విక్రమ్ కుమార్. నాని తన క్యారక్టరైజేషన్ నచ్చి సినిమాను వెంటనే ఓ కే చేశాడట. త్వరలో అధికారిక ప్రకటన వెలువడే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.
నాని ప్రజంట్ `జెర్సీ` చిత్రంలో నటిస్తున్నాడు. గౌతమ్ దర్శకత్వంలో తెరకెక్కిస్తోన్న ఈ పీరియాడికల్ స్టోర్ట్స్ డ్రామా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. జెర్సీ సినిమా పూర్తయిన వెంటనే నాని -విక్రమ్ కుమార్ సినిమా ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. త్వరలో ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడే అవకాశాలున్నాయి.