రాజమౌళి అడిగారా? లేదు... అంతా అబద్ధమే!
on Nov 24, 2018
తెలుగులో రామ్‌చరణ్, అల్లు అర్జున్, ఎన్టీఆర్ తదితర హీరోలకు ఎలాంటి స్టార్డమ్ వుందో? కన్నడలో యష్‌కి అటువంటి స్టార్డమ్ వుంది. కన్నడ యూత్‌లో క్రేజీ హీరో ఎవరంటే.. యష్ పేరు వినిపిస్తుంది. ‘కె.జి.యఫ్’ సినిమాతో ఈ హీరో తెలుగు, తమిళ, హిందీ ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు. ఇటీవల విడుదలైన ఆ సినిమా ట్రైలర్ అందరి దృష్టిని ఆకర్షించింది.
అలాగే, మరో వార్త భారతీయ సినిమా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. అదేంటంటే... ‘రాజమౌళి దర్శకత్వంలో యష్ ఓ సినిమా చేయబోతున్నాడు’ అని! రాజమౌళి దర్శకత్వంలో రామ్‌చరణ్, ఎన్టీఆర్ నటిస్తున్న ‘ఆర్ఆర్ఆర్’లో యష్ విలన్‌గా చేస్తున్నాడన్నది మెయిన్ టాపిక్. ఈ వార్తపై యష్ స్పందించాడు. అటువంటిది ఏమీ లేదని స్పష్టం చేశాడు. ‘‘నాతో సినిమా చేస్తానని రాజమౌళి నన్ను అడిగినట్టు, సినిమా చేయమని నన్ను సంప్రతించినట్టు పలు మాధ్యమాల్లో వార్తలు చూశాను. అవన్నీ అవాస్తవాలే. అబద్ధాలే. వాటిలో నిజం లేదు. నన్ను ఎవరూ సంప్రతించలేదు. అంత పెద్ద దర్శకుడి పేరుని వాడుకోవడం కరెక్ట్ కాదు. ప్రస్తుతానికి నా దృష్టి అంతా ‘కె.జి.యఫ్’ మీదే వుంది’’ అని యష్ పేర్కొన్నారు.