విలేజ్ లో `మహర్షి`
on Nov 22, 2018
సూపర్ స్టార్ మహేష్ ప్రజంట్ వంశీ పైడిపల్లి దర్శతకత్వంలో `మహర్షి` సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. మహేష్ కు ఇది 25వ సినిమా కావడంతో ఈ సినిమా పై భారీ అంచనాలే ఉన్నాయి. అయితే ఈ మూవీలో మహేష్ మూడు డిఫరెంట్ గెటప్స్ లో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ ఫస్ట్ లుక్ తో పాటు టీజర్ కు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. మరోవైపు ఈ మూవీ శాటిలైట్, డిజిటల్ హక్కులు భారీగా అమ్మడయ్యాయట. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ డెహ్రాడూన్తో పాటు అమెరికాలో ఇంపార్టెంట్ సీన్స్ చిత్రీకరించారు. ఇక మిగిలిన పార్ట్ ను హైదరాబాద్ లో చిత్రీకరించనున్నారు. అయితే ఈ షెడ్యూల్ లో గ్రామీణ నేపథ్యంతో కూడిన సన్నివేశాలుంటాయట. అందుకోసం హైదరాబాద్లో విలేజ్ సెట్ వేస్తున్నట్లు తెలుస్తోంది. మహేష్, అల్లరి నరేష్ ఈ షెడ్యూల్ లో పాల్గొననున్నారట. ఈ సినిమాకు ఈ సన్నివేశాలే హైలెట్ గా నిలిచే అంశాలుని తెలుస్తోంది. సి.అశ్వనీదత్ , పీవీపీ , దిల్ రాజు సంయుక్తంగా నిర్మిస్తో న్న ఈ చిత్రం ఉగాది కానుకగా రానుంది.