పవన్ కళ్యాణ్ రాజకీయ సినిమా?
on Nov 21, 2018
పవన్ కల్యాణ్ మళ్లీ మేకప్ వేసుకోవాలని నిర్ణయించుకోవడానికి కారణం ఒక్కటేనట! టార్గెట్ పాలిటిక్స్... టార్గెట్ పాలిటిక్స్... టార్గెట్ పాలిటిక్స్! సినిమాల్లో నటించనని పదే పదే ప్రకటించిన పవన్ కల్యాణ్, మళ్లీ సినిమాలు చేయాలనుకోవడానికి కారణం కథలో రాజకీయ నేపథ్యమేనట! పవన్ సన్నిహితుడు, జనసేన పార్టీ శ్రేయోభిలాషి నిర్మాత రామ్ తాళ్ళూరి ఓ కథ సిద్ధం చేయిస్తున్నారు. పవన్‌కల్యాణ్‌ని దృష్టిలో పెట్టుకుని, పవన్ రాజకీయ అడుగులకు ఉపయోగపడే విధంగా కథ సిద్ధం చేయిస్తున్నారట. అయితే... ఇక్కడో ట్విస్ట్ వుంది. ఈ సినిమాలో పవన్‌ది ప్రత్యేక పాత్ర మాత్రమే. అదీ సినిమా ద్వితీయార్థంలో వస్తుంది. సినిమాలో హీరోగా వరుణ్ తేజ్ లేదా సాయిధరమ్ తేజ్ నటించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది. సినిమాకు 'గోపాల గోపాల', 'కాటమరాయుడు' సినిమాల దర్శకుడు డాలీ (కిషోర్ పార్ధసాని) దర్శకత్వం వహిస్తారని టాక్. 2019 ఎన్నికలకు ముందు సినిమాను విడుదల చేయాలనేది ప్లాన్. రాజకీయ నేపథ్యంలో రూపొందనున్న ఈ సినిమాలో ఎవరిని టార్గెట్ చేస్తారో?? పవన్ రాజకీయ ప్రయాణానికి ఎంత ఉపయోగపడుతుందో?? వెయిట్ అండ్ సీ.