కొరటాలకు షాకిచ్చిన రామ్ చరణ్!!
on Nov 16, 2018
మెగాస్టార్ చిరంజీవితో కొరటాల శివ ఓ సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా కోసం ఇప్పటికే స్క్రిప్టు వర్క్ కూడా పూర్తి చేశాడు కొరటాల. సైరా సినిమా షూటింగ్ పూర్తయిన వెంటనే ఈ ప్రాజెక్ట్ ని సెట్స్ పైకి తీసుకెళ్లడానికి ప్లాన్ చేస్తున్నారు రామ్ చరణ్. ఇదిలా ఉంటే రామ్ చరణ్ ఇటీవల కొరటాలతో ఒక డీల్ కుదుర్చుకున్నాడట. ఈ వార్త సోషల్ మీడియాలో ప్రస్తుతం హల్ చల్ చేస్తోంది. ఆ విషయానికొస్తే... రామ్ చరణ్ ప్రస్తుతం బోయపాటి దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా జనవరిలో సంక్రాతి కానుకగా విడుదల కానుంది. దీని తర్వాత రాజమౌళి దర్శకత్వంలో సినిమా చేయబోతున్నాడు. ఈ సినిమా తర్వాత కొరటాల శివతో సినిమా చేయాలని డిసైడ్ అయ్యాడట చరణ్. ఈ లోపు చిరు, కొరటాల సినిమా అయిపోతుంది..కాబట్టి వెంటనే తన సినిమా ప్రారంభించాలని ఇటీవల కొరటాలతో చెప్పాడట. దీనికి కొరటాల కూడా ఒప్పుకున్నారట. ఆ సినిమాకు సంబంధించి అడ్వాన్స్ కూడా ఇచ్చి కొరటాలకు షాకిచ్చాడట చెర్రి. మెగాపవర్ స్టార్ ప్లాన్ సూపర్బ్ గా అంటున్నారు సినీ వర్గాలు.