మెగాస్టార్ రైతుగా మారితే!!?
on Nov 13, 2018
డైలాగ్ రైటర్ గా కెరీర్ స్టార్ట్ చేసి స్టార్ డైరక్టర్ గా ఎదిగాడు కొరటాల శివ. స్టార్ హీరోలు సైతం అతనితో సినిమాలు చేయడాఇకి ఆసక్తి కనబరుస్తున్నారంటే డైరక్టర్ గా అతడి స్టామినా ఏంటో అర్థం చేసుకోవచ్చు. మహేష్ తో `భరత్ అనే నేను` చిత్రం చేసి సక్సెస్ కొట్టాడు. తన తదుపరి చిత్రంగా మెగాస్టార్ తో ఓ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిన విషయమే. ఇప్పటి వరకు ఈ సినిమా పై ఎటువంటి క్లారిటీ రాలేదు కానీ, సోషల్ మీడియాలో మాత్రం నిత్యం ఈ సినిమా గురించి వార్తలు వస్తూనే ఉన్నాయి. తాజాగా ఒక న్యూస్ హల్ చల్ చేస్తోంది.
అదేమిటంటే....ఏ సినిమా చేసినా కమర్షియల్ హంగులతో పాటు అందులో అండర్ కరెంట్ గా ఏదో ఒక సందేశం ఉండేలా స్క్రిప్టు చేయడం కొరటలా అలవాటు. అందులో భాగంగానే ఈ సారి చిరంజీవితో చేయబోయే సినిమాలో మంచి సోషల్ మెసేజ్ ని పొందుపరిచాడట. చిరంజీవి రైతు పాత్రలో కనిపించనున్నాడట. ఇప్పటి రైతు స్థితిగతులను మరియు వారి సమస్యలను చూపిస్తూ ..పరిష్కార మార్గం కూడా చూపించే విధంగా ఉంటుందట సినిమా. ఈ ఏడాది ఆఖరులోగా ప్రారంభమయ్యే ఈ సినిమాలో తమన్నాకానీ, హ్యూమా ఖురేషి కానీ హీరోయిన్ గా నటించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.