స్టైలిష్ స్టార్ విజయ్‌ని కొండెక్కించాడు!!
on Nov 12, 2018
`గీత గోవిందం` చిత్రం ప్రీ రిలీజ్ ఫంక్షన్ కు ముఖ్య అతిథిగా హాజరయ్యాడు స్టైలిష్‌స్టార్ అల్లు అర్జున్. ఆ సినిమా బ్లాక్ బస్టర్ గా అవడంతో విజయ్ దేవరకొండ నటించిన `టాక్సీవాలా` చిత్రం ప్రీ రిలీజ్ ఫంక్షన్ కి కూడా బన్నీ ముఖ్య అతిథిగా విచ్చేశాడు. హైదరాబాద్ లో జరిగిన ఈ కార్యక్రమంలో బన్ని మాట్లాడుతూ క్రేజీ స్టార్ విజయ్ దేవరకొండను ఆకాశానికెత్తాడు. `` విజయ్ లో ఒరిజినాలిటీ ఉంటుందినీ, ఇప్పటి వరకు మేమంతా ఓ రొట్టలో ఇరుక్కుపోయాం. కానీ విజయ్ అలా కాకుండా కొత్తగా ట్రై చేస్తున్నాడు. ఆ కొత్తదనమే జనానికి నచ్చి తనను అభిమానిస్తున్నారు. ఫెంటాస్టిక్ పర్ఫార్మర్. మేమంతా గోల్డెన్ స్పూన్ తో వచ్చినవాళ్లం కానీ, విజయ్ అలా కాదు. కాంటెపరరీ ట్రెండ్స్ పట్టుకుని అర్జున్ రెడ్డి లాంటి డిఫరెంట్ సినిమాలు చేస్తూ తనకు తానుగా ఎదుగుతున్నాడు. ఇలాంటి వ్యక్తులు ఎదిగే క్రమంలో కొన్ని నెగిటివ్స్ కూడా ఉంటాయి వాటిని వదిలేయడం మంచింది. అతడు రియల్ పర్పార్మర్ అంటూ విజయ్ ని ఒక్కాసారిగా ఆకాశానికెత్తాడు బన్ని. అలాగే మేమందరం సినిమానే నమ్ముకుని బతుకుతున్నాం కాబట్టి పైరసీని ఎంకరేజ్ చేయవద్దంటూ చివరిగా చెప్పాడు.